Monday, 31 December 2018

ఆముద మెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్

 శతావధానములో ఆముదాల వారియొక్క ప్రతిభతో సభికులకు మోదము ( ముదము ) గల్గినదని .......... 


ధీమహితాత్ముఁడై చెలఁగి దీర్ఘకవిత్వ పరంపరక్రియా

స్తోమ మహాహవాద్భుత యశోవిభవాత్ముఁడు నాముదాల వి

ద్యామహిమాన్వితుండునయి ధారణ ధారల తేలియాడుచో 

నా ముద మెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్


Sunday, 25 March 2018

lord sree rama hd images కోసం చిత్ర ఫలితం

శ్రీరామనవమి శుభాకాంక్షలు ................

ఇనవంశోద్భవుఁడై ప్రశత తర ధర్మేచ్చా విధానుండునై
ఘన విశ్వేశ్వర చాప ఖండన మహా కార్యంబునన్ సీతనున్
మనువున్ జెంది ప్రభావ శస్త్రములచే మార్తాండుడై నిల్చి దు
ర్జనుడౌ రావణు నేల గూల్చితె నమస్కారంబిదే రాఘవా !