గురువులు శ్రీకంది శంకరయ్య గారికి, శ్రీ పోచిరాజు కామేశ్వర రావుగారికి, యితర కవిపుంగవులకు మరియు కవిమిత్రులకు "ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు."
నవ లావణ్య సుగంధ మాలికలు కంఠంబంధునన్ వైచి ప
ల్లవ సాదృశ్య పదప్రభావముల సల్లాపంబులన్ సల్పుచున్
జవ జీవంబులె పిల్ల తెమ్మెరలుగా సంతోషమే హాసమై
ప్లవ నామాంగన వచ్చె నేఁడు నిదె యాహ్లాదంబులన్ బంచుచున్.
కన్నీటినడగించ గల వర్ష ధారచే
.......... కర్షకవ్రజమెల్ల హర్షమొంద
ధర్మంబు నాల్గుపాదముల వెల్గెడునట్లు
.......... జననాయకులు భువిన్ జననమంద
స్వార్థంబులను వీడి సార్థకంబగు రీతి
.......... ప్రజలెల్ల సేవాపరత్వమంద
మూఢత్వమును బాపి మోహంబులను ద్రుంచి
.......... నిజతత్త్వ విజ్ఞాన నిధిని బొంద
నందఱకు భోగ సౌభాగ్య మందజేసి
నిందలకు కుందుటన్నది నీరుగార్చి
సంతసమ్మును చేకూర్చ స్వాగతంబు
వందనంబిదె "ప్లవనామ" వత్సరంబ.
కవికులముల దీపింపుము
సువిశాల జగత్తుకెల్ల శోభనమిడుచున్
నవ వారధి నిర్మింపగ
ప్లవవత్సరమా ఘటింతు వందన శతముల్
No comments:
Post a Comment