Wednesday, 15 February 2012

సరదా పద్యము


ఏమి పొద్దుపోక, ఈ రాత్రి భోజనానతరము అలా నడుచుకుంటూ పోతున్నాను.  మామూలుగా ఐతే నేను నిఠారుగా నడువను.  నా ప్రక్కన నడిచే ఒకతనిని చూచి నిఠారుగా ఉండాలి, నిఠారుగా నడవాలి అనే ఆలోచన చేసినాను. ఈ విషయాన్ని నేను ఎవరికైనా చెప్తే ఎందుకు నిఠారుగా నడవాలి అనే ప్రశ్న వేస్తారు కదా........... ఈ ఆలోచనే ఈ నా పద్యానికి పునాది.  

ఏదో సరదా పద్యమంతే.  

నిట్టనిఠారుగా నిలువ నేర్పును ధైర్యము శక్తియుక్తుల
ట్టట్టనె వచ్చి చేరునవి యాంతరశోభను వృద్ధిచేయ, చూ
పెట్టుము నీదు యోగ్యతను, పిన్నలు పెద్దలు మెచ్చుకొందురే,
పట్టివి, చెప్పినట్టులిది భావన జేయుము నీమనంబునన్.      

No comments:

Post a Comment